Monday, April 12, 2021

లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్‌ పర్సన్‌గా శ్రీనివాస్..

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌గా పని చేస్తున్న మాటేటి శ్రీనివాస్‌ను లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్‌ పర్సన్‌గా నియమించారు. కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల్లో డిస్ట్రిక్ట్‌ 320జీ గవర్నర్‌గా ఎన్నికైన నాగుల సంతోష్‌ కార్యవర్గాన్ని ప్రకటించారు. సుల్తానాబాద్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ను జోన్‌ చైర్‌ పర్సన్‌గా నియమించగా, తన నియామకానికి సహకరించిన సీనియర్‌ క్లబ్‌ సభ్యులు వలస నీలయ్య, జూలూరి అశోక్‌, మిట్టపెళ్లి ప్రవీణ్‌ కుమార్‌లకు కృతజ్ఞతలు
తెలిపాడు. అలాగే క్లబ్‌ సభ్యులు మూల మహేందర్‌ రెడ్డి, ఎలిగేటి రమేష్‌, దీకొండ భూమేష్‌, చక్రధర్‌, జగన్‌ సేట్‌, వెంకటేష్‌, రాజేశం, సతీష్‌ కుమార్‌లు శ్రీనివాస్‌ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News