Sunday, May 12, 2024

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణి….

ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామంలో మూడు కుటు-ంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను వైస్‌ ఎంపిపి సుదగోని శ్రీనాథ్‌ గౌడ్‌, సర్పంచ్‌ కట్ట వెంకట్‌రెడ్డిలు కలిసి గ్రామపంచాయతీ అవవరణలో గురువారం అందజేశారు. గ్రామానికి చెందిన ఇరుమల్ల శ్రీనివాస్‌కు రూ.20వేలు, జుట్టు- రాజయ్యకి రూ.24 వేలు, గవ్వల ఆగవ్వకు రూ.24 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్లు దురుముట్ల శ్రీనివాస్‌, లెంకలపల్లి లచ్చయ్య, నవీన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement