Wednesday, May 22, 2024

Karimnagar – డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కాంగ్రెస్ వంటా వార్పు… .. ఎక్కడికక్కడ అరెస్ట్ లు

కరీంనగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనకు పోలీసులు అడ్డుకట్ట వేశారు డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేసి కేటాయించాలని, అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మాట తప్పిన బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ నాయకులు.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉదయం నుండి ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

అయితే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసుల కండ్లు గప్పి అక్కడికి చేరుకోగా పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ఈ అరెస్ట్ ను నరేందర్ రెడ్డి ప్రతిఘ‌టించడంతో తోపులాట జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement