Thursday, February 22, 2024

Banswada – బోనమెత్తిన సభాపతి పోచారం

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. సభాపతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు మంగళహారతులు ఆట పాటలతో బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. గ్రామస్తుల ఆటపాటలతో సభాపతి మమేకమై బోనాన్ని ఎత్తుకొని మహిళలతో గ్రామంలో గ్రామ దేవతలకు మొక్కులను తీర్చుకొన్నారు.

ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, విండో అధ్యక్షులు సంజీవరెడ్డి, జడ్పిటిసి సభ్యులు గంగారం, మండల పరిషత్ అధ్యక్షురాలు, తెరాస పార్టీ నాయకులు పత్తి రాము, ఎల్ఐసి గంగన్న, పత్తి లక్ష్మణ్, కన్నె రవి, బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాసుల బాలరాజు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement