Tuesday, May 14, 2024

Wonderla: ఫాదర్స్ డేకు వండర్ లా ప్రత్యేక ఆఫర్ 2 + 1

హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ జూన్ 18, 2023న ఫాదర్స్ డే పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వండర్‌లా 2+1 ఆఫర్‌ను అందజేస్తుంది. తద్వారా మొత్తం కుటుంబానికి చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తామనే భరోసా అందిస్తుంది.

ఈ సందర్భంగా వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ.. తండ్రీ బిడ్డల బంధం మాటల్లో చెప్పలేనంతగా అపూర్వమైన, అసాధారణమైన అనుబంధం. వండర్‌లాలో తాము ఆ బంధాలను గౌరవిస్తూ ఫాదర్స్ డేని జరుపుకోవడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ తండ్రులు నిస్వార్థంగా ఇచ్చే ప్రేమ, మార్గదర్శకత్వం, మద్దతును, చిరకాల జ్ఞాపకాలను గౌరవిస్తున్న వేళ, ఆ అమూల్యమైన జ్ఞాపకాలను కలిసి స్మరించుకోవడానికి సరైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement