Thursday, May 2, 2024

వినాయకచవితి వేళ మనమంతా ఇష్టపడే… తీయ్య‌టి వంట‌లు

భారతదేశంలో పండుగ సీజన్‌ వినాయకచవితితో ప్రారంభమవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్‌ కారణంగా వేడుకలు పెద్దగా చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగను ఇంటిలో మాత్రమే కాదు అత్యంత ఆనందకరమైన కమ్యూనిటీ పండుగగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగ శోభ అత్యంత అందంగా అలంకరించిన విగ్రహాలతో మరింత అందంగా కనిపిస్తుంది. వినాయకచవితి వేళ గణపతి బప్పా అలంకరణకు సంబంధించి ముందుగానే ప్రణాళిక చేయడం కనిపిస్తుంటుంది. సంప్రదాయ నేపథ్యాల మొదలు సమకాలీన శైలి వరకూ ఈ అలంకరణ కొనసాగుతుంది. భారతీయ పండుగ ఏదైనా పసందైన విందు, తియ్యందనాలు ఉండాల్సిందే. వినాయకచవితి వేళ అది మరింత ముఖ్యం. విగ్రహ స్థాపన రోజు నుంచి నిమజ్జనం వరకూ ఈ నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది. హైదరాబాద్‌ వాసులకు ఖైరతాబాద్‌ గణేష్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గణేశ మండపం ఇది. 2019లో ఖైరతాబాద్‌ గణేశ విగ్రహాన్ని 60అడుగుల ఎత్తులో రూపొందించారు. దేశంలో అతి ఎత్తైన గణేష విగ్రహంగా ఇది ఖ్యాతి గడించింది. వినాయక చవితి వేళ ఇంటిలో జరుపుకునే పూజలతో పాటుగా కమ్యూనిటీలో పూజ జరుపుకోవడమూ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి రోజూ పూజ చేయడంతో పాటుగా నైవేద్యమూ సమర్పిస్తుంటారు.

ఈసంద‌ర్భంగా గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ… బాల గణేషుని కథతో పాటుగా మోదక్‌ (కుడుములు) పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారన్నారు. అయినప్పటికీ ఆ లీలా విశేషాలు మనకు ఆసక్తిగానే ఉంటాయన్నారు. నిజానికి ఈ కథలు మన హృదయంలో నిలిచిపోయాయన్నారు. ఈ కుడుములకు విభిన్న పేర్లు ఉన్నట్లుగానే విభిన్న రకాలుగా తయారుచేసినప్పటికీ, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారన్నారు. బయట రవ్వ కోటింగ్‌ ఇచ్చి కొంకణ్‌లో ములిక్‌ గా చేయడంతో పాటుగా సంప్రదాయ మోదక్‌ల్లా అరటిపళ్లతో చేస్తే, కేరళలో మినప్పు, స్పైసెస్‌తో సాల్టీ స్టీమ్డ్‌ వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తైగా తీర్చిదిద్దుతారన్నారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయన్నారు. షాప్‌లలో ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్‌ కనిపిస్తుంటాయన్నారు. వీటితో పాటుగా బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్‌ కూడా అందించడం కనిపిస్తుందన్నారు. ఈ సంవత్సరం తెలంగాణాలో అత్యంత ఆశ్చర్యకరమైన మోదక్స్‌ను వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement