Saturday, May 4, 2024

Delhi: ఆంధ్ర వనిత మండలిలో శ్రావణ శోభ.. సామూహిక వరలక్షి వ్రతం, కృష్ణాష్టమి వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్ర వనిత మండలి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ చివరి శుక్రవారం కావడంతో వనిత మండలిలో సామూహిక వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించే తెలుగు మహిళలు పెద్దసంఖ్యలో ఐటీవో ప్రాంతంలోని వనిత మండలిలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముందుగా పెండ్యాల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు.

ఆ తర్వాత కృష్ణాష్టమి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. అనంతరం భగవద్గీత పారాయణం, సంగీత విభావరి, దాండియా, కోలాటాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. సంగీత, భగవద్గీత గురువులను ఈ సందర్భంగా సన్మానించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి ఏవీఎం అధ్యక్షులు సూర్యకాంతి త్రిపాఠి, ప్రధాన కార్యదర్శి వి. అనసూయ, ఉపాధ్యక్షులు గిరిజ, కుసుమ, కోశాధికారి సత్యవతి, జాయింట్ సెక్రటరీ పార్వతి రెడ్డి, వివిధ బ్రాంచ్ సెక్రటరీల ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ సందడిగా జరిగాయి. పూజలకు హాజరైన మహిళలకు తాంబూలాలను అందజేశారు. అనంతరం మండలి ఆధ్వర్యంలో నడుస్తున్న హెల్త్ కేర్ సెంటర్‌లో అవసరమైన వారికి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement