Monday, April 29, 2024

నల్లాల్లో మురుగునీరు..

మోండా : నల్లాల్లో తాగునీటికి బదులు కలుషిత నీరు సరఫరా అవుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని తెలుగుదేశం నాయకుడు గౌరీశంకర్‌ యాదవ్‌ విమర్శించారు. మోండా డివిజన్‌ పరిధిలోని రెజిమెంటల్‌ బజార్‌ ప్రాంతంలోని ఇంటినెంబర్‌ 9-2-384 ఇంటినెంబరు మొదలు సుమారు 50 కుటుంబాలకు గత పక్షం రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు వస్తుందన్నారు. సమస్యను జలమండళి అధికారుల దృష్టికి తీసుకు వెల్లామని అయినా సమస్య పరిష్కరానికి నోచుకోవడం లేదన్నారు. కార్పోరేటర్‌ కనిపించడంలేదని, సమస్య చెప్పుకుందామన్నా ప్రజలకు అందుబాటులొ లేకుండా పోతున్నారన్నారు. నల్లాల్లో వచ్చిన నీరు కనీసం వాడుకోవడానికి కూడా వీలు కాని విధంగా దుర్గంధ భరితంగా వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు చేఎ్టాలని లేదంటే ఆంధోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement