Wednesday, May 8, 2024

HYD: ఏపీ, కర్ణాటకలో చిన్నతరహా గృహ రుణాల కోసం రూ.150 కోట్లను సమీకరించిన వృద్ధి హోమ్ ఫైనాన్స్

హైదరాబాద్ : బిఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసిజి రంగాలలో 25ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన సుంకు రామ్ నరేష్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటవ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. సహ వ్యవస్థాపకులుగా సందీప్ అరోరా (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) సునీల్ మెహతా (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) బెంగళూరు కేంద్రంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్‌ను 2022లో ప్రారంభించారు.

ఈసందర్భంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, ఎండీ- సీ.ఈ.ఓ సుంకు రామ్ నరేష్ మాట్లాడుతూ… ఎలివేషన్ క్యాపిటల్‌తో తమ గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని గుర్తించి, తమకు మద్దతును అందించిన వారందరికి తాము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ గణనీయమైన పెట్టుబడి పెరుగుదలతో, గృహ పరిష్కారాలను అందించే తమ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా వేతన దారులకు, స్వయం ఉపాధిదారులకు రుణాలు పొందడం కష్టాంగా ఉంటుందన్నారు.

ఎలివేషన్ క్యాపిటల్ భాగస్వామి మ్రిదుల్ అరోరా మాట్లాడుతూ… పెనట్రేషన్ కేవలం 11%, ఈ రంగంలో ఇంకా ఎన్నో అద్భుతమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నమ్ముతున్నామన్నారు. ఇప్పటివరకు గృహాలకు సంబంధించి హోమ్ ఫైనాన్స్ తీసుకొని వారి టార్గెట్ గా తాము పనిచేస్తామన్నారు. తద్వారా ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. వృద్ధి బృందం అసమానమైన అనుభవం భారతీయులకు అందుబాటులో ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement