Tuesday, April 30, 2024

P.v.Sindhu Knee Injury | డాక్ట‌ర్ల స‌ల‌హా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నా : పీవీ.సింధు

భారత స్టార్.. డబుల్ ఒలింపిక్ పతక విజేత పివి సింధు రెన్నెస్‌లో జరిగిన BWF వరల్డ్ టూర్ సూపర్ 750, ఫ్రెంచ్ ఓపెన్‌లో తన రౌండ్ 16 గేమ్ మధ్యలో మోకాలి గాయం కారణంగా వెనుదిరిగింది. కాగా, ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన సింధు త‌న‌ మోకాలిని స్కాన్ చేయించుకున్నట్టు తెలిపింది. పరీక్షించిన డాక్ట‌ర‌లు త‌న ఎడమ మోకాలిలో ఒత్తిడిని గుర్తించిన‌ట్టు తెలిపింది.

త‌న ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్‌ను మ‌ధ్య‌లోనే ఆపేయ‌డం మంచిదయ్యిందిని వెల్ల‌డించింది సింధు. కాగా, త‌ను మళ్లీ శిక్షణ ప్రారంభించే ముందు వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు వివ‌రించింది. రాబోయే ఒలింపిక్స్‌పై దృష్టి సారించడానికి కూడా విరామం ఒక అవకాశం అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement