Sunday, May 5, 2024

HYD: సనత్ నగర్ లో ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్.. ప్రేమ్ కుమార్

అమీర్ పేట్, (ప్రభన్యూస్) : కొత్తగా ఓటర్ కార్డు కోసం లేదా ఓటర్ కార్డులో సవరణల కోసం ప్రయత్నించే అభ్యర్థులు సనత్ నగర్ లోని కంజర్ల యాదయ్య పార్క్ (శ్యామల కుంట పార్క్) లో రెండు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి అధికారులు కోరారు. ఈ సందర్బంగా సర్కిల్ 17 టాక్స్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ… కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు లేదా ఇప్పటికే ఓటర్ కార్డు కలిగి ఉండి అందులో తప్పులు ఉన్నా, చిరునామా, ఇతర మార్పులు ఏవైనా చేసుకోవాలనుకునే వారు ఈ స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ డ్రైవ్ 18,19 రెండు రోజుల పాటు సనత్ నగర్ లోని శ్యామలకుంట పార్క్ లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రజలు వచ్చే అప్పుడు తమ వెంట ఆధార్ కార్డు, ఫోటో , బర్త్ సర్టిఫికెట్, కరెంట్ బిల్ తదితర ఆధారిత డాక్యుమెంట్ లను తీసుకొనిరావాలంటూ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement