Saturday, May 4, 2024

India vs Ireland – .నేడే తొలి టి 20 మ్యాచ్… యువ ఆట‌గాళ్ల‌కు అగ్ని ప‌రీక్ష‌…

డబ్లిన్‌: భారత్‌-ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది.డబ్లిన్‌ వేధికగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. మరోసా రి టీమిండియా యువ ఆటగాళ్లతో మైదానంలో అడుగుపెట్టనుంది. యువ జట్టుకు జస్ప్రీత్‌ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. దాదాపు ఏడాది తర్వాత బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి భారత జట్టులో అడుగుపెట్టనున్నాడు. ఇతనిపైనే అందరి దృష్టి కేంద్రికృతమై ఉంది. టీమిండియా కీలక బౌలర్‌ బుమ్రాకు ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌కు తన ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ మంచి వేదికకానుంది. భారత సెలక్టర్ల దృష్టంతా ఈ స్టార్‌ పేసర్‌పైనే ఉంది. ప్రతిభవంతుడైన బుమ్రా సేవలను త్వరలో జరిగే మెగా టోర్నీలలో వినియోగించుకోవాలని టీమిండియా మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. చాలా కాలం గాయంతో క్రికెట్‌కు దూరమైన బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకొని ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో 4 ఓవర్ల కోటాతో మూడు మ్యాచుల్లో దాదాపు 12 ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇందులోనే తన ఫామ్‌ను నిరూపించుకొ వాల్సిన అవసరం బుమ్రాకు ఉందనడంలో సందేహంలేదు.

ఓవరాలగ్‌ బుమ్రాకు ఐర్లాండ్‌ సిరీస్‌ పరీక్షగా మారనుంది. బుమ్రాతో పాటు ప్రసిద్‌ కృష్ణ కూడా గాయం నుంచి కోలుకొని టీమిండియాలో పురగామనం చేయనున్నాడు. ప్రసిద్‌ కూడా తన పాత ఫామ్‌ను కనబర్చితే రానున్న టోర్నీలలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక వెస్టిండీస్‌ టూర్‌లో విఫలమైన సంజూ సంసన్‌కు ఐర్లాండ్‌ టూర్‌తో మరో అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో రాణించి తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఇషాన్‌ కిషన్‌ నుంచి ఇతనికి గట్టి పోటి ఉంది. మరోవైపు ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ కూడా టీమిండియాలో పునరాగమనం కోసం సిద్ధమవుతు న్నాడు. ఇలాంటి సమయంలో సంసన్‌కి ఈ టోర్నీ చాలా కీలకంగా మారనుంది.

రింకూసింగ్‌, జితేశ్‌శర్మ అరంగేట్రం చెస్తారా..
ఇక ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లు సైతం భారత జట్టులో చోటు లభించింది. తొలిసారి టీమిండియాకు ఎంపికైన యువ క్రికెటర్లు రింకూసిం గ్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌) ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చెస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇద్దరూ ఐపీఎల్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. తమ మొదటి అంతర్జాతీయా మ్యాచ్‌ ఆడేందుకు ఆతృతగా ఉన్నారు.

తిలక్ వ‌ర్మ, జైస్వాల్‌పైనే అందరి దృష్టి
తమ అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుమైన క్రీడా ప్రతిభాను కనబర్చిన హైదరాబాదీ యువ తిలక్‌ వర్మతో పాటు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌లో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకు న్నారు. ముఖ్యంగా హైదరాబాదీ యువ సంచలనం తిలక్‌ వర్మ కఠిన సమయాల్లో టీమిండియాకు అండగా నిలిచి అందరి ప్రశంసలు పొందాడు. సీనియర్లు విఫలమవుతున్న కఠిన పిచ్‌లపై తాను మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అలవోకగా పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లోనూ రాణిస్తే ఆసియాకప్‌, ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడం సాధ్యమే నని మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జైస్వాల్‌ సైతం పర్వాలేదనిపించాడు. తనకు లభించిన అవకాశాల్ని మంచిగా సద్వినియోగించు కున్నాడు. ఇక ఆసియా గేమ్స్‌లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఈ సిరీస్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు.

పేసర్లకు మంచి అవకాశం
ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్‌లు భారత పేసర్లకు మంచి అవకాశాలుగా మారనున్నాయి. తమ సత్తా నిరూపించుకోవడానికి ఈ పిచ్‌లు మంచిగా సరిపోతాయని విశ్లేషకుల అంచనా. తుది జట్టులో స్టార్‌ బౌలర్‌ బుమ్రాతో పాటు ప్రసిద్‌ కృష్ణ చోటు ఖాయం. ఇక అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, వీరిలో ఎవరికీ అవకాశం లభిస్తుందో చూడాలి. స్పిన్‌ విభాగంలో రవి బిష్నోయ్‌, ఆల్‌రౌండర్లు శిమద్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌లు రాణించేందుకు సద్ధంగా ఉన్నారు.

ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం
పొట్టి ఫార్మాట్‌లో ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయలె ము. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ క్వాలిఫాయింగ్‌ పోటీ ల్లో సత్తా చాటిన ఐర్లాండ్‌ టీ20 ప్రపంచప్‌- 2024కు అర్హత సాధించింది. ప్రస్తుతం టీమిండియా యువ ఆటగాళ్లతో బరిలో దిగుతుంటే.. ఐర్లాండ్‌ మాత్రం తమ పూర్తి స్థాయి జట్టులో పోరుకు సిద్ధమైంది. ఆల్‌రౌండర్‌ పౌల్‌ స్టిర్‌లింగ్‌ నేతృత్వంలోని ఐర్లాండ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోను పటిష్టంగా ఉంది. ఐర్లాండ్‌ను వారి సొంత మైదనాల్లో ఓడించడం టీమిండియాకు కఠిన సవాళే. ఇంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 సిరీసుల్లో భారత జట్టు నెగ్గింది. కానీ ఈసారి యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు ఐర్లాండ్‌ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది.

- Advertisement -

జట్టు (అంచనా): జస్ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, రింకూ సింగ్‌, సంజూ సంసన్‌ (వికెట్‌ కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.
ఐర్లాండ్‌ జట్టు (అంచనా): పౌల్‌ స్టిర్‌లింగ్‌ (కెప్టెన్‌), రాస్‌ ఆడైర్‌, మార్క్‌ ఆడైర్‌, ఆండి బల్బిర్‌నీ, కర్టిస్‌ కాంఫర్‌, గారెత్‌ డెలానీ, జార్జ్‌ డాక్‌రెల్‌, ఫియోన్‌ హాండ్‌, జోష్‌ లిట్టిల్‌, బారీ మాక్‌కార్టీ, హారీ టెక్టర్‌, లోర్సన్‌ టూకెర్‌ (వికెట్‌ కీపర్‌), తియో వాన్‌ వియోర్కమ్‌, బెన్‌ వైట్‌, క్రేగ్‌ యంగ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement