Friday, May 3, 2024

Exclusive – ప్రేక్షకుల నెత్తిన రీ…”మేకులు”…

రీమేకు సినిమాల మీద మరోసారి చర్చ మొదలైంది. చిరంజీవి నటించిన తాజా రీమేక్‌ భోశాశంకర్‌ ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో రీమేకులు అవసరమా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. తెలుగులో రచయితలు లేరా, వాళ్లు కథలు ఇవ్వలేరా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకభాషలో విజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో తీయడమే రీమేక్‌. గతంలో వందలాది రీమేక్‌ సినిమాలు తెలుగులో వచ్చాయి. వాటిలో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం రీమేక్‌ అంటే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో ఎవరైనా అగ్ర హీరో రీమేక్‌ సినిమా చేస్తున్నాడంటే చాలు.. అభిమానులు వద్దని వారిస్తున్నారు. రీమేక్‌ అంటే ఒరిజినల్‌ సినిమాను మక్కికిమక్కీ తీయరు. నేటివిటికి తగినట్టుగా కొన్ని మార్పులు చేస్తుంటాయి. అయినప్పటికీ రీమేక్‌ వద్దని అభిమానులు వారిస్తున్నారు. వీరి అభ్యంతరానికి కారణం ఉంది. గతంలో మాదిరికాదు. ఒక చిత్రం ఏ భాషలో అయినా సరే విడుదలైన తర్వాత దాన్ని ఏదో విధంగా ప్రేక్షకులు చూస్తున్నారు. ఓటీటీలో చాలా వరకు ఇవి స్ట్రీమింగ్‌ అవుతుంటాయి. ఆ విధంగా ఒరిజినల్‌ సినిమా చూసేసి ఉంటారు కాబట్టి, దాన్ని రీమేక్‌ చేయడం తమ అభిమాన హీరోకు తగదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, రవితేజ, రామ్‌ చరణ్‌ వంటి స్టార్స్‌ అందరూ రీమేక్‌ సినిమాలవైపు మొగ్గుచూపుతుండటం వల్లే ప్రేక్షకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒరిజినల్‌ సినిమాల కథలు ముందుగానే తెలియడం వల్ల అభిమానుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందనే అభిప్రాయాలా సైతం వ్యక్తం అవుతున్నాయి.


ప్రేక్షకుల ఆలోచనను, అభిరుచిని అర్థం చేసుకోకుండా కొందరు హీరోలు మాత్రం రీమేక్‌ల మీద రీమేక్‌లు తీసేస్తున్నారు. ఈ సినిమాల విషయంలో ప్రేక్షకుల అనాసక్తి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. కొంతగ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’, ‘భీవ్లూ నాయక్‌’, ‘బ్రో’. రీమేక్‌లు. అలాగే పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి సైతం రీమేక్‌ సినిమా ఖైదీ నెంబర్‌ 150తో ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ తర్వాత గాడ్‌ఫాదర్‌, తాజాగా భోళాశంకర్‌ సినిమాలు రీమేక్‌ చేసినవే.
వెంకటేష్‌కు రీమేక్‌ చిత్రాల హీరోగా పేరుంది.

నారప్ప, దృష్యం, గురు ఇవన్నీ రీమేక్‌ సినిమాలే. హీరోలు ఎవరైనా సరే మొదట ఇతర భాషల్లో హిట్‌ అయినా సినిమా కథల్లో నటించడానికి మొగ్గుచూపుతున్నారు. మళయాల, తమిళ భాషల్లో వైవిధ్యమైన కథా చిత్రాలు వస్తుంటే తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు సమాధానం లేదు. హీరోలు రీమేక్‌ సినిమాలు చేస్తామంటున్నారని దర్శకులు, నిర్మాతలు అంటున్నారు. కాబట్టి వారికి వేరే గత్యంతరం లేదు. ఇలాంటి పరిస్థితి ఇతర భాషల్లో ఉందా అంటే ఇంత తీవ్రంగా లేదని సినీ వర్గాలు అంటున్నాయి. కేవలం తెలుగులోనే రీమేక్‌ సినిమాల నిర్మాణం విరివిరిగా జరుగుతోందని వారు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement