Sunday, May 12, 2024

ఇంట‌ర్ ద్వితీయ ప‌రీక్ష‌లు ర‌ద్దు యోచ‌న‌లో విద్యా శాఖ‌…

హైదరాబాద్‌, : రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతునే ఉంది. ప్రతి రోజు 4వేల నుంచి 5వేల మధ్యలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో నమోదవుతునే ఉన్నాయి. మరొ వైపు రాష్ట్రంలో ఈనెల 21 వరకు లాక్‌డౌన్‌ అమలు లో ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాయిదా పడ్డ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మళ్లి జరగడం సాధ్యమయ్యే పనిలా కనిపించడంలేదని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. రద్దు అయ్యే అవ కాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని పేర్కొంటు న్నారు. అధికారులూ సైతం ఈ విషయంలో ప్రాథ మిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. టెన్ట్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ముందు నుంచి సీబీఎస్‌ఈ విధానాలనే అనుసరిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా 12వ తరగతి పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ ఏ నిర్ణయం తీసుకోనుందో అదే నిర్ణయా న్ని ఇంటర్‌ బోర్డు సైతం అమలు చేయాలని భావి స్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశవ్యా ప్తంగా పదో తరగతి, 11వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే 12వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్‌ మొదటి వారంలో సమీక్షించి దానిపై ఒక నిర్ణయం తీసుకుం టామని ప్రకటించింది. సరిగ్గా ఇలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వాళ్లను ప్రమోట్‌ చేస్తూ, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు వాయిదా వేసింది. జూన్‌ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి పరీక్షలపై ఓ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలనూ రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సర్కార్‌ కూడా సీబీఎస్‌ఈ విధానాన్నే అనుసరించి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పరిస్థితులు ఇంకా ఇలానే ఉంటే లాక్‌డౌన్‌ను ఇంకా కొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా లేకపో లేదు. మరీ ఇలాంటి క్రమంలో రాష్ట్రంలో విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జూన్‌ మొదటి వారంలో పరీక్షల రద్దు విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోను న్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పరీక్షలను నిర్వహిం చడం తప్పనిసరైతే ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు రాయడం లాంటి ప్రత్యామ్నాయ పద్ధతు లను వెతికే పనిలో అధికారులు పడినట్లు సమా చారం. మే 1వ తేదీ నుంచి 30 వరకు జరగాల్సిన ఇంటర్‌ ఎగ్జామ్స్‌ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement