Friday, May 17, 2024

నిషేదిత భూముల ఆటో లాక్….

హైదరాబాద్‌, : రాష్ట్రంలో వెలుగు చూస్తున్న భూ ఆక్రమనల నేపథ్యంలో లాక్‌డౌన్‌ తర్వాత నిషేదిత భూముల జాబితా రీ నోటిఫై చేయాలని భావిస్తున్నట్లు విశ్వ సనీయంగా తెలిసింది. తద్వారా ప్రభుత్వ,అసైన్డ్‌, వక్ఫ్‌, దేవాదాయ, ఇతర భూములకు రిజిస్ట్రేషన్లు కాకుండా ఆటోలాక్‌ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమా చారం. 58 లక్షల పాస్‌ పుస్తకాలకుగానూ 55.6 లక్షల పాస్‌ పుస్తకాలే పంపిణీ చేయడం, వివాదాస్పద భూములపై ఎటువంటి నిర్ణయం అమలు చేయకపోవడంతో వీటి అంశం పెండింగ్‌లో పడింది. రాష్ట్రవ్యాప్తంగా 796792 ఖాతాలు బీ కేటగిరీలో పెండింగ్‌లో పెట్టారు. ఇందులో 456155 ఖాతాలకు పాస్‌ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయి ంచినప్పటికీ డిజిటల్‌ సిగ్నేచర్స్‌ లేక పెండింగ్‌లో పడ్డాయి. ధరణిలో వీటికి పెండిగ్‌ డీఎస్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఈ సమస్యకు తెరపడింది. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తప్పాయి. మరోవైపు త్వరలో 69,85478 ఎకరాలకు చెందిన పార్ట్‌బి వివాదాస్పద భూములపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చయనుంది.
భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలోని భూ వ్యవహారాలపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తు న్నది. అయితే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేసే అస్త్రం నిషేదిత భూముల జాబితా (22 ఏ)పై తాజా వరుస ఘటనలతో మరోసారి చర్చ తీవ్రమైంది. దేవాదాయ, వక్ఫ్‌, అసైన్డ్‌, ప్రభుత్వ, అటవీ భూములు ప్రైవేటు పరంకాకుండా రూపొందించిన ఈ చట్టంతో ప్రాథ మిక దశలోనే ఆయా భూములు రిజిస్ట్రేషన్‌ కాకుండా నిలు వరించే అవకాశం ఉంది. ఇందులోకి అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ భూములు 74వేల ఎకరాలు, వక్ఫ్‌ భూములు 45 వేలు, ప్రభుత్వ భూములు 21.04 లక్షల ఎకరాలు, అసైన్డ్‌ 44.42 లక్షల ఎకరాలు ఈ నిషేదిత భూముల జాబితాలో చేర్చాల్సి ఉంది. 2015 డిసెంబర్‌లో హైకోర్టు నిషేదిత భూముల జాబితా సిద్దం చేయాలని ఆదేశించింది. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. 2017లో అ ప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా ఆదేశాలు జారీ చేసినా, కార్యాచరణకు నోచలేదు. ధరణి వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలోఅమలులోకి వచ్చేముందే నిషేదిత భూముల జాబితా సిద్దం చేసి నోటిఫై చేయాలని తహశీల్దా ర్‌లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు కోరుతున్నారు. భూ రిజిస్ట్రేషన్లలో సందిగ్ధతలకు తెరదించి మరింత సులభతరం చేస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించలేదు. 1971లో పట్టా దారు పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌లను అమలులోకి తెచ్చిన తర్వాత జరిగిన అక్రమాలపై నివేదిక సిద్దం చేసిన ప్రభుత్వం తాజాగా సాదాబైనామాలు, అసైన్‌ ్డ భూములకు చట్టబద్దత కల్పించింది. అయితే మిగిలిపోయిన ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములను నిషేదిత భూముల జాబితాలో చేర్చితేనే లక్ష్యం నెరవేరుతుంది. కాగా 2007 నుంచి రాష్ట్రంలో నిషేదిత భూముల జాబితా ప్రక్రియ నిలిపివేశారు.
8 లక్షల ఎకరాల్లో వివాదాలు…
రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల భూములు వివాదాస్ప దమని ప్రభుత్వం తేల్చి ప్రత్యేక ట్రిబ్యునల్స్‌కు పరిష్కార బాధ్యత అప్పగించింది. వీటిపై చురుగ్గా కార్యాచరణ జరుగుతోంది.
ఈ వివాదాలు నల్గొండ, ఖమ్మం, రంగా రెడ్డి, కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లాల్లోనే తేలాయి. కోర్టు వివాదాలు, అటవీ శాఖతో విభేదాలు, భూబదలాయింపు, క్రమబద్దీక రణలు, వ్యక్తిగత వివాదాలున్న అనేక రకాల భూ కేసుల సంఖ్య పది లక్షల ఎకరాల్లో ఉన్నట్లుగా స్పష్టమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement