Sunday, April 28, 2024

రఘురామ ఎఫ్ఐఆర్ లో ఏముందో తెలుసా?

ఏపీ ప్రభుత్వంతోపాటు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇవాళ మరోసారి విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్దమవుతున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఆయన్ను మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రాఘురామ అరెస్ట్ కు సంబంధించి సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు పేర్కొంది. ఎంపీ తన వ్యాఖ్యలు, హావభావాల ద్వారా ప్రజల్లో విద్వేషభావం నింపేలా ప్రవర్తించారని ఎఫ్‌ఐఆర్ లో  పేర్కొన్నారు. ప్రజల్లో హింస ప్రజర్విల్లేలా వ్యవహరించారని తెలిపారు. రెడ్డి, క్రిస్టియన్‌ సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని, వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తద్వారా ఆయా వర్గాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేశారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

కాగా, ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలపై  వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు.. రాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాత్రికి రాత్రే వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ మరోసారి విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు తన అరెస్ట్ పై రఘురామరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై విచారమ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకూ మెజిస్ట్ర్టేట్‌ ముందు ఆయన్ను హాజరుపరచవద్దని సీఐడీకి సూచించింది. పోలీసు కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఈ కేసుపై హైకోర్టు విచారణ జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement