Monday, April 29, 2024

HYD: 25,000కు పైగా యువతకు నైపుణ్యం పెంచే బహుళ-రాష్ట్ర కార్యక్రమాన్ని పూర్తి చేసిన హెచ్సీసీబీ

హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్ సీసీబీ), 25,000కు పైగా యువతకు విక్రయాలు, మార్కెటింగ్ శిక్షణకు సంబంధించి తమ బహుళ-రాష్ట్ర అప్‌స్కిల్లింగ్ కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. వై4డీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈసంద‌ర్భంగా హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్‌కి చెందిన చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ… పలు రాష్ట్రాల్లో 25,000 మంది యువతకు విక్రయాలు, మార్కెటింగ్‌లో నైపుణ్యాన్ని పెంపొందించాలనే త‌మ వ్యూహాత్మక కార్యక్రమానికి ఈ ప్రకటన ముగింపు అన్నారు. మన కమ్యూనిటీల్లో అర్థవంతమైన సాధికారతను అందించాలనే త‌మ నిరంతర నిబద్ధతలో ప్రధాన భాగం ఈ ప్రయత్నమ‌న్నారు. తాము ఈ మైలురాయిని చేరుకున్నప్పుడు, త‌మ దృష్టి సాంఘీక-ఆర్థిక సాధికారత కార్యక్రమాల్లో తదుపరి పెట్టుబడుల వైపు మళ్లుతుందన్నారు.

మహారాష్ట్ర నుండి ప్రోగ్రామ్ లబ్ధిదారుల్లో ఒకరైన దిపాలి సలుంఖే మాట్లాడుతూ.. తాను హెచ్ సీసీబీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నప్పుడు, అది త‌న వృత్తిపరమైన ప్రయాణాన్ని మార్చివేసిందన్నారు. మరీముఖ్యంగా తాను ఈ రంగాల్లో విలువైన పరిజ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలను పొందినప్పుడు ఇది మరింతగా మారిందన్నారు. గుజరాత్‌కు చెందిన మరో లబ్ధిదారుడు చింటూ ఘెవరం ప్రజాపతి మాట్లాడుతూ… తాను త‌న కుటుంబం ఆప్టికల్ వ్యాపారాన్ని సాంప్రదాయ పద్ధతిలో నడుపుతున్నానన్నారు. అది పెద్దగా లాభ సాటిగా లేకపోయిందన్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత తాను డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించాను, ఇది మార్కెట్‌లో త‌మ వ్యాపారాన్ని బలోపేతం చేసిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement