Monday, April 29, 2024

T20 WC | టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో…

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. జూన్‌ 1 నుంచి వెస్టిండీస్‌-అమెరికా వేదిక‌గా జ‌గ‌ర‌నున్న ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా, తాజాగా, టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది.

ప్రపంచకప్ కోసం రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?’ అనే క్యాప్షన్‌తో ఎక్స్ (ట్విట్టర్) వేదిక‌గా ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోలో భార‌త జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాల‌ను చూపించ‌డం జ‌రిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌

ఈ మెగా టోర్నీ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. ప్ర‌తీ గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ 5న‌ ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.

ఇండియా vs ఐర్లాండ్‌ – జూన్‌ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్‌ – జూన్‌ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ – జూన్‌ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా – జూన్‌ 15 (ఫ్లోరిడా)

Advertisement

తాజా వార్తలు

Advertisement