Monday, April 29, 2024

Zero Shadow Day | రేపు బెంగళూర్‌లో “నీడ” మాయం..

బెంగళూర్‌లో రేపు జీరో షాడో డే జరగబోతోంది. బుధవారం రోజు నగర ప్రజలు ‘జీరో షాడో డే’ని అనుభవించనున్నారు. ఈ సంఘటన రేపు మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 మరకు జరుగుతుంది. అప్పుడు సూర్యుడు మన నడినెత్తిపై ఉంటాడు. దీంతో నీడ అనేది కనిపించదు. బెంగళూర్‌తో పాటు కన్యాకుమారి, భోపాల్, హైదరాబాద్, ముంబై ప్రజలు కూడా వేరే రోజుల్లో ఈ జీరో షాడో డేని చూసే అవకాశం ఉంది.

జీరో షాడో డే అంటే ఏమిటి..?

సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. ఈ దృగ్విషయం సాధారణంగా భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సంభవిస్తుంటుంది. ఇక్క సూర్యుడి కోణం, భూమితో దాదాపుగా లంబంగా ఉంటుంది. ఫలితంగా నీడ అనేది కనిపించడు.

భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు, పలు సందర్భాల్లో దాని స్థానం మారుతుంటుంది. ఏడాదిలో రెండు వేర్వేరు సమయాల్లో సూర్యుడు, భూమికి సరిగ్గా నిటారుగా, లంబంగా వస్తాడు. ఆ సమయంలో సూర్య కిరణాలు మన నడినెత్తిపై ఉంటాయి. దీంతో మనం నీడను ఎక్స్‌పీరియన్స్ చేయలేము. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, +23.5 మరియు -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాలలో జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది.

ఇతర నగరాల్లో జీరో షాడో డే:

  • బెంగళూరు: ఏప్రిల్ 24, ఆగస్టు 18 (స్థానిక మధ్యాహ్నం: 12:17, 12:25)
  • హైదరాబాద్: 09 మే , 05 ఆగస్టు (స్థానిక మధ్యాహ్నం: 12:12, 12:19)
  • ముంబై: 15 మే,యు 27 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:34, 12:45)
  • భోపాల్: 13 జూన్. 28 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:20, 12:23)
Advertisement

తాజా వార్తలు

Advertisement