Friday, May 24, 2024

IPL | ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌‌హెచ్ మ్యాచ్‌.. మెట్రో స‌మ‌యం పొడిగింపు..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించే వారు తప్పక తెలుకోవాల్సిన విషయం.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీన ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు – స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు స‌మ‌యం పొడిగించారు. ఆ రోజు మెట్రో రైలు సేవల సమయం పొడిగించారు. నాగోల్, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్‌లలో చివ‌రి రైళ్లు రాత్రి 12:15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1:10 గంట‌ల‌కు గ‌మ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. ఐపీఎల్ సమయంలో సాధారణంగా ఎప్పుడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉన్నా.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement