Wednesday, May 15, 2024

AP: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్లో జరిగే సభలో పాల్గొంటారు.

- Advertisement -

మధ్యాహ్నం అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ప్రచార సభల కోసం వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement