Sunday, May 26, 2024

జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకల్లో ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’

హైదరాబాద్, ఆగస్టు 31: దక్షిణాసియా సినిమాలు, కంటెంట్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 Global, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ అనే షోను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తోంది. ప్రపంచ తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు, నేహా శెట్టితో సహా పలువురు అగ్ర తారలు పాల్గొన్న ఈ 3 గంటల సుదీర్ఘ వేడుక, ఉత్తమ తెలుగు వినోదాన్ని అందిస్తూ, తెలుగు క్యాలెండర్‌లోని శుభప్రదమైన 5వ నెల శ్రావణాన్ని గౌరవించింది.

ఈ నైట్‌కు గ్లామర్‌ని జోడిస్తూ, హోస్ట్‌లు సిరి హనుమంత్, రవి, అలియాస్ రవి రాక్లే, తారలతో కలిసి సంప్రదాయం, వినోదాల మేళవింపుతో ప్రదర్శించిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దక్షిణాసియా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా ప్రముఖ తెలుగు డ్రామా ‘త్రినయిని’లో ప్రధాన కథానాయిక ఆషిక ఆధ్యాత్మిక ప్రదర్శనను కూడా ఆకట్టుకోనుంది. అనంతరం పడమటి సంధ్యా రాగం, శుభస్య శీఘ్రం, మా వారు మాష్టారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి ప్రదర్శనలతో తారలు అదరగొట్టారు. సరిగమప గత సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్మిత సైతం ప్రేక్షకుల కోసం సంగీత సంగీత మాధుర్యంతో అలరించారు.

ఈసందర్భంగా జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ… తమ వారసత్వం గురించి గర్వించే దక్షిణాసియా పౌరులకు భాషలతో ఎంతో శక్తివంతమైన అనుబంధం ఉంటుందన్నారు. జీ5 గ్లోబల్‌లో అత్యధికంగా వినియోగించబడే భాషల్లో తెలుగు ఒకటన్నారు. ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు, షోలకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయా భాషల్లో కంటెంట్ వినియోగం పెరుగుతోందన్నారు. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ పేరిట ప్రత్యేక షో ద్వారా తమకు ప్రియమైన భాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా తమకు అవకాశం రావడం ఎనలేని గర్వకారణమని పేర్కొన్నారు. వీక్షకులు జీ5 గ్లోబల్‌లోని 111+ టైటిల్స్‌ను మిస్ కాకుండా చూడాలంటే వార్షిక ప్యాక్‌కి సబ్‌స్ర్కైబ్ కావలసి ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement