Saturday, April 27, 2024

జనరల్ అట్లాంటిక్ సహకారంతో నిధుల విలువను పెంచుకున్న ఫోన్ పే

12 బిలియన్ల ముందస్తు అంచనా విలువతో ప్రముఖ ప్రపంచ గ్రోత్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ నుండి 350 మిలియన్ల నిధులను సేకరించామని భారతదేశంలోని అతిపెద్ద ఫిన్ టెక్ వేదికల్లో ఒకటైన ఫోన్ పే ప్రకటించింది. జనవరి 2023లో 1 బిలియన్ డాలర్ల వరకు నిధుల సేకరణ కోసం ఫోన్ పే ప్రారంభించిన కార్యక్రమానికి ది జనరల్ అట్లాంటింక్ పెట్టుబడులు తొలివిడతను సూచిస్తున్నాయి. వచ్చే నెలతో ముగుస్తుందని భావిస్తున్న రెండో విడత కోసం పలు కొత్త ప్రపంచ, భారతీయ పెట్టుబడి సంస్థలు ఇప్పటికే సంతకాలు చేశాయి.

ఈసంద‌ర్భంగా జనరల్ అట్లాంటిక్ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా హెడ్ శంతను రస్తోగి మాట్లాడుతూ… సమీర్, రాహుల్, ఫోన్ పే యాజమాన్య బృందం పేమెంట్ల డిజిటలీకరణను ముందుకు నడపడం కోసం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకువెళుతూ, భారత ప్రజలకు ఆర్థిక సాధనాల యాక్సెస్ ను విస్తృతం చేస్తోందన్నారు. బహిరంగ ఏపీఐ ఆధారిత ఇండియా స్టాక్ లో అభివృద్ధి చేసిన సమ్మిళిత ఉత్పత్తుల స్వీకరణను ముందుకు తీసుకు వెళ్లడంపై వారు నిలకడగా దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నారు. ఈ విజన్ జనరల్ అట్లాంటిక్ దీర్ఘకాలిక దృఢసంకల్పమైన సమ్మిళితం, సాధికారతపై దృష్టి కేంద్రీకరించే అధిక వృద్ధి వ్యాపార సంస్థలకు అండగా నిలవాలనే దానికి అనువుగా ఉంటోందన్నారు. భారతదేశంలో డిజిటల్ నవ్యావిష్కరణ తదుపరి దశకు వీలు కల్పించడంలో సహాయపడేందుకు ఫోన్ పే బృందంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం త‌మకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement