Tuesday, May 7, 2024

హైద‌రాబాద్ లో ‘ఫార్ములా -ఈ’ , రయ్‌.. రయ్ అంటూ దూసుకుపోనున్న రేస్ కార్లు..

ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ త్వ‌ర‌లో అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌ నగర నడిబొడ్డున జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న తొలి దశ రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మహేంద్ర రేసింగ్‌ సీఈవో దిల్‌బాగ్‌ గిల్‌ అనధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జకార్తాలో జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడిన‌ గిల్‌.. హైదరాబాద్‌లో రేస్‌ నిర్వహణపై స్పందిస్తూ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ ఈవెంట్‌తో భారత్‌లో మోటార్‌స్పోర్ట్స్‌కు ఊతం లభించ‌నుంది. దీంతో భారత్‌లో అద్భుతమైన డ్రైవర్లు వెలుగులోకి వస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement