Sunday, May 19, 2024

AP | మ‌రోరెండు రోజులపాటు భారీ వ‌ర్షాలు..

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపుల‌తో భారీవర్షం కురవగా… మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి, ఏలూరు జిల్లాలలో భారీవర్షం పడింది. మంగళవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో120.5 మిమీ, రాజమహేంద్రవరంలో 92 మిమీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.

కాగా, ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా రేపు (బుధవారం) కూడా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ద్రోణి ప్రభావంతో విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైయస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని… శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement