Sunday, May 5, 2024

క్షయ పరీక్షల ప్రచారంలో దేశీయ సాంకేతికత ట్రూనాట్‌ కీలకపాత్ర

భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం గురించి మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో శ్రీరామ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ టీబీ పరీక్ష కార్యక్రమంలో పాలుపంచుకుంటుండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఈ వ్యాధి నిర్మూలన కోణంలో ఇంటింటికీ పరీక్షలు చేయడం అత్యంత కీలకమైన ముందడుగన్నారు. ట్రూనాట్‌తో మార్పు తీసుకురాగలమని భావిస్తున్నామని అన్నారు. మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీటీఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయర్‌ మాట్లాడుతూ… భారతదేశంలో అతి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా క్షయ నిలుస్తోందన్నారు. ప్రపంచంలో నాలుగోవంతు క్షయ రోగులు ఇక్కడే ఉన్నారన్నారు. ట్రూ నాట్‌తో గ్రామీణ ప్రాంత వాసులు కూడా మెరుగైన సేవలను పొందగలరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement