Wednesday, May 22, 2024

TS: హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసానికి మధ్య యుద్ధం… రాహుల్ గాంధీ

రాజ్యాంగంపై విధ్వంస కుట్ర
రిజర్వేషన్లు రద్దు చేస్తారు
ప్రజల హక్కులను కాలరాస్తారు
మోదీ పాలనలో పేదలకు నష్టం
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం
దేశవ్యాప్తంగా కూడా ఇలాగే అమలు చేస్తాం
నిర్మల్ జనజాతర సభలో రాహుల్ గాంధీ
పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్ర‌తినిధి : రాజ్యాంగం, ప్రజల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ విధ్వంసానికి మధ్య ఈ ఎన్నికల్లో యుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఆదివారం జ‌రిగిన జనజాతర సభలో ప్ర‌సంగించారు. దేశవ్యాప్తంగా రెండు కూటముల మధ్య యుద్ధం జరుగుతోందని, ఇందులో రాజ్యాంగం పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే కూటమి మరో వైపు కుట్ర చేస్తోందన్నారు. రాజ్యాంగంతో ప్రజలకు సకల హక్కులు లభిస్తుంటే, బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటోందని, అదే జరిగితే రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని రాహుల్ హెచ్చ‌రించారు. దేశంలోని దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల్ని కాలరాసేందుకు బీజేపీ కూటమి కుట్ర చేస్తోందన్నారు.

సంప‌న్నుల కోస‌మే మోదీ..
సంపన్నుల కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు ₹16 లక్షల కోట్లు మాఫీ చేశారని, ఇందులో ₹ 25 000 కోట్లు ప్రజలందరికీ ఇవ్వవచ్చని రాహుల్​ అన్నారు. కార్పొరేట్​ కంపెనీలకు లక్షలకు లక్షల కోట్లు ధారాదత్తం చేస్తూ.. కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే.. రైతులను సోమరులను తయారు చేస్తున్నామని కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని, మరి కొద్ది మంది ధనికులకే ప్రయోజనం కల్పిస్తున్న ఈ డబ్బు 130 కోట్ల పేదల డబ్బన్నారు. అందుకే. ఈ తంతునే మార్చాలను కున్నామని రాహుల్​ అన్నారు.

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు..

- Advertisement -

తెలంగాణలో తాము ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, మహిళల ఖాతాల్లో నెలకు ₹2500 చొప్పున జమ చేస్తున్నామని, ప్రతి మహిళకు ఏడాదికి ₹30,00‌‌0 లబ్ధి చేకూరుతుందని, ₹10 లక్షల ఆరోగ్య బీమా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. ఈ ఆరు పథకాలను యావత్​ భారత ప్రజలకు అందిస్తామని రాహుల్​ హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, 70 ఏళ్ల ఎన్నికల చరిత్రలో ఆదిలాబాద్​ జిల్లానుంచిఏ ఒక్క మహిళకు పోటీ చేసే అవకాశం రాలేదన్నారు. పార్లమెంటులో పోరాడేందుకు గోండు బిడ్డను తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని, ఆత్రం సుగుణక్కకు అవకాశం ఇచ్చారన్నారు. ఆమెకు రాజకీయ వారసత్వం లేదు. భూపోరాటాలు చేసిన కోమరం భీం స్పూర్తితో గెలిపించాలని రేవంత్​ విజ్ఞప్తి చేశారు.

దత్తత తీసుకుంటా.. అభివృద్ధి చేస్తా

ఆదిలాబాద్​ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని సీఎం రేవంత్​ అన్నారు. లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని, సిమెంట్​ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, రైతులను ఆదుకుంటామని అన్నారు. రైతు భరోసా అందలేదని బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ ఇప్పుడు చెబుతున్నారు.. ఈనెల 9లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు వేస్తాం అన్నారు. రుణమాఫీ చేస్తాం.. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆగస్టు 15లోపు ₹2లక్షలు రుణమాపీ చేస్తాం అని రేవంత్​ స్పష్టంచేశారు.

తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది..

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలు అమలు కాలేదని కేసీఆర్​ అంటున్నారు. సినిమా పరిశ్రమ తెలుసు కదా.. చీర కట్టి ఆర్టీసీ బస్సు ఎక్కు.. టిక్కెట్టు అడిగితే ఆరు పథకాలు అమలు చేయనట్టే.. అని ఎద్దేవా చేశారు. ఇక.. తెలంగాణకు ఏమి ఇచ్చారని బీజేపీని ప్రశ్నించారు. గాడిద గుడ్డు ఇచ్చారు.. ప్రధాని మోదీ ఏమి తెచ్చిండు. గాడిద గుడ్డు తెచ్చిండు.. మరీ బీజేపీకి కర్రు కాల్చి వాత పెడదామా? అని ప్రజలను సీఎం రేవంత్​ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement