Monday, May 13, 2024

అందరూ మాస్కులు ధరించాలి: కార్పొరేటర్‌

సికింద్రాబాద్ : ప్రతి యోక్కరు మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకొవాలని రాంగోపాల్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీరసుచిత్రశ్రీకాంత్‌ అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్‌లోని చుట్టలబస్తీ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్‌ టెస్టులను పరిశీలించేందుకు కార్పొరేటర్‌ చీరసుచిత్ర విచ్చేశారు. అక్కడే ఉన్న వైద్యులతో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు… సౌకర్యాల పరంగా ఏవిధంగా ఉన్నాయే తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంవత్సర కాలంగా భారతదేశాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 సెకండ్‌ వే కొనసాగుతున్నదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఎవరు కూడ బయటకు రావద్దన్నారు. బయటకు వచ్చేవారు తప్పనిసరి మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ను కూడ వెంట ఉంచుకొవాలన్నారు. జ్వరం, దగ్గు, తలనొప్పి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే టీకా వచ్చిందని, వీటిని లక్షలాది మంది తీసుకున్నారని చెప్పారు. మిగిత వారికి కూడ విడుతాల వారిగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి అప్జల్‌, ఆశ్విన్‌, నిమన్‌జైన్‌, శ్రావణ్‌, సాయికుమార్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement