Sunday, May 5, 2024

ఉపేంద్రాచారి ఎన్నిక..

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐఖ్య సంఘం నూతన అధ్యక్షులుగా పడకంటి ఉపేంద్రాచారి ఎన్నికయ్యారు. మండల కేంధ్రంలోని ఘట్‌కేసర్‌ మోడల్‌ హై స్కూల్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలువెలువడ్డాయి. ఈఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి యాదగిరిచారి, పడకంటి ఉపేంద్రాచారి పోటీపడ్డారు. 642 ఓట్లు పోల్‌ కాగా యాదగిరిచారికి 296 ఓట్లు రాగా ఉపేంద్రాచారికి 335 ఓట్లు వచ్చాయి. 39 ఓట్ల మెజారిటీతో ఉపేంద్రాచారి గెలుపొందారు. ఈసందర్బంగా నూతన అధ్యక్షులు ఉపేంద్రాచారి ఈసందర్బంగా మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన మండల విశ్వ బ్రాహ్మణులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎం. ప్రవీణ్‌కుమార్‌ చారి, దేవరకొండ రాజాచారి, గుండోజు కృష్ణాచారి, తరిణ మహేంద్రాచారి, కుంబోజు బ్రహ్మచారి, బి, బాబూచారి, జె. నాగభూషన్‌, సి.హెచ్‌. శ్యాంసుందర్‌, ఎస్‌. వెంకటప్రభాకరచారి, అరుణ్‌చారి, ప్రకాష్‌చారి, కృష్ణాచారి, నరేష్‌చారి, ఓంకార్‌చారి, టి. శ్రీనుచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement