Wednesday, May 22, 2024

TS | సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డికి గుండెపోటు..

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు (అన్న) ఎనుముల తిరుపతి రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. బుధవారం సాయంత్రం నుంచి కొంత నలతగా ఉండడాన్ని గమించిన తిరుపతి రెడ్డి వైద్యుల సలహా మేరకు గురువారం ఉదయం మాదాపూర్‌ లోని ఓ కార్పోరేట్‌ ఆసుపత్రికి వెళ్లి చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి రెడ్డికి స్టెంట్‌ వేయాలని నిర్ణయించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతలను తిరుపతి రెడ్డి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి రెడ్డి ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. మరో సోదరుడు కొండల్‌ రెడ్డి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement