Saturday, April 27, 2024

ఈ నెల 28న పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని జాతికి చాటిచెప్పేలా తెలంగాణ సర్కారు శతజయంతి ఉత్సవాలు కొనసాగిస్తుండడం తెలిసిందే. తాజాగా హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు.

ఈ విగ్రహం ఎత్తు 26 అడుగులు కాగా.. 2 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రూ.27 లక్షల వ్యయంతో రూపొందించారు. ఈ విగ్రహం తయారీలో పలు లోహాలను ఉపయోగించారు. కాగా, పీవీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు పేరు మార్చారు. ఇకపై నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా పిలవనున్నారు. పీవీ విగ్రహం నెలకొల్పే ప్రాంతం చుట్టూ అర ఎకరం మేర అందంగా ముస్తాబు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement