Thursday, May 2, 2024

సైకిల్‌పై కోడిగుడ్లు అమ్మిన సోనూసూద్

కరోనా కష్టకాలంలో పలువురికి ఆపన్న హస్తం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ సేల్స్ మ్యాన్‌గా మారాడు. అది కూడా సైకిల్‌పై గుడ్లు అమ్ముకుంటూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. సోనూ సూద్ ఏంటి సైకిల్‌పై గుడ్లు అమ్మడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.

‘సైకిల్‌పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్‌తో సోనూసూద్ అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్‌కు సేల్స్ మ్యాన్‌గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సైకిల్‌పై కూర్చొని తన సూపర్ మార్కెట్‌ను సోనూసూద్ పరిచయం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గుడ్లు, బ్రెడ్ ఇతర వంట సరుకులను చూపిస్తూ.. సేల్స్ మ్యాన్ మాదిరిగా వాటి ధరను వివరించారు. ‘డెలివరీ చేయాలంటే అదనపు ఛార్జీలు కూడా ఉన్నాయి బాస్’ అంటూ వీడియోను ముగించారు. ‘ఉచిత హోం డెలివరీ కూడా ఉంది. 10 గుడ్లు కొనుగోలు చేస్తే ఒక బ్రెడ్ ఉచితం’ అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. అయితే సోనూసూద్ ఈ ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ను ఎందుకు ఓపెన్ చేశారనే విషయంపై స్పష్టత లేదు. చిన్న వ్యాపారాలకు మద్దతు ఇచ్చేలా తన ఫాలోవర్లను ప్రోత్సహించడానికి సోనూ ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement