Thursday, April 25, 2024

లింగుస్వామి సినిమాపై రామ్ పోతినేని ట్వీట్ !!

ఎనర్జిటిక్ స్టార్ టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఉప్పెన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.

తాజాగా ఈ సినిమా ఫైనల్ నెరేషన్ పూర్తయిందని హీరో రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్, కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది…లవ్ యూ లింగస్వామి సర్, రోల్ కెమెరా అంటూ షూటింగ్ ప్రారంభం చేద్దాం అంటూ ట్వీట్ చేశాడు రామ్. కాగా ఈ సినిమా రామ్ కెరీర్ లోనే హై బడ్జెట్ గా తెరకెక్కబోతోందట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement