Saturday, April 27, 2024

మణికొండ కాకతీయ సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ

మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కేలండర్ ఆవిష్కరణకు గూడూరు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా కమ్మ లక్ష్మీ నాగేశ్వర రావు, ఆలస్యం నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాకతీయ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా హాజరైన అతిధులందరినీ సన్మానించారు.

కమ్మ సామాజికవర్గంలోని వివాహాలతో పాటు, పేదరికంతో చదువుకోలేకపోతున్న కమ్మ విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రెసిడెంట్‌ కమ్మ బ్రహ్మాజీ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్స్ మందలపు జగదీష్, ప్రత్తిపాటి మాల్యాద్రి, జనరల్ సెక్రెటరీ వీరగంధం వీరభద్ర రావు, ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ వాసిరెడ్డి నరేష్‌, కోశాధికారి తూమాటి శివశంకర్‌, జాయింట్ సెక్రటరీ గోగినేని శ్రీనివాస్ చౌదరి, జాస్తి సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అచ్యుత రామయ్య, చావ వినయ్ కుమార్, బండారుపల్లి ధనుంజయ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement