Thursday, May 9, 2024

కాశ్మీరీల గాయాల‌కు బిజెపి ఉప్పు, కారం చ‌ల్లుతుంది – ఒమ‌ర్ అబ్డుల్లా..

క‌శ్మీర్ – గాయ‌ప‌డిన కాశ్మీర‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా, మ‌రింత విద్వేష భావాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పెంచుతున్న‌ద‌ని ఆరోపించారు నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా. కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదని.. ఎన్నికలు మా హక్కు అని అన్నారు..ఎన్నిక‌ల నిర్వ‌హించాల‌ని ఎవరి ముందు అడుక్కోబోమ‌ని తెలిపారు. ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం గురించి అడిగిన ప్రశ్నకు. ఆయ‌న స‌మాధానం ఇస్తూ, జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని ఆరోపించారు. అందుకే వారు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారు ప్రజలను వేధించాలనుకుంటున్నారని.. తగిలిన గాయాలకు మందు పూయడానికి బదులుగా, వారు గాయాన్ని మరింత తీవ్రతరం చేయాలనే తపనతో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని, అయితే వారు కేవలం ఉప్పు, కారం రుద్దుతున్నారని మండి ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement