Thursday, March 28, 2024

నీకేమో అందమెక్కువ సాంగ్ అప్ డేట్ ఇచ్చిన .. వాల్తేరు వీరయ్య టీం

వాల్తేరు వీరయ్య చిత్రం నుండి నీకేమో అందమెక్కువ అని సాగే పాటని జనవరి 11న ఉదయం 10.35 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నారు… హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. కేఎస్‌ రవింద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ రవితేజ కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య ఐదో పాటకు సంబంధించిన అప్టేట్‌ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

Advertisement

తాజా వార్తలు

Advertisement