Thursday, May 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 43

43.
ఏవం బుద్ధే: పరం బుద్ధ్వా
సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో
కామరూపం దురాసదమ్‌||

అర్థము : మహాబాహో! ఓ అర్జునా ! ఈ విధముగా తనను ఇంద్రియ, మనో బుద్ధులకు పరమైన వానినిగా తెలుసుకొని, ఆధ్యాత్మ బుద్ధిచే (కృష్ణభక్తిరసభావనము) చే మనస్సును స్థిరపరిచి, ఆ విధముగా ఆధ్యాత్మిక బల ముచే మనుజుడు కామమనెడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను.

భాష్యము : ఈ మూడవ అధ్యాయము చివరకు జీవి కృష్ణ చైతన్యం వైపుకు అడుగులు వేయవలెనని సూచిస్తుంది. ఆత్మ అంతిమముగా నిర్విశేషముగాని, శూన్యముగాని కాబోదని భగవంతుని నిత్య సేవకుడని తెలియజేస్తుంది. ఈ భౌతిక జీవనములో ప్రతి ఒక్కరూ కామము చేత ప్రభావితులగుదురు. అయతే కృష్ణ చైతన్య సహకారంతో భౌతికమైన ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించవచ్చును. అందువలన ఎవరూ తమ విద్యుక్త ధర్మములను హటాత్తుగా వదలి పెట్టవలసిన అవసరం లేదు. ఇక నిశ్చితమైన బుద్ధిని కలిగి ఆత్మ యొక్క సహజ స్థితి వైపుకు మరలుట ద్వారా దివ్యత్వమును పొందవచ్చును. దీనికి కృష్ణ చైతన్యములో ఉన్నతమైన బుద్ధి కలిగినట్టివారి శిక్షణ అత్యావశ్యకము. అట్లుకాక కృత్రిమముగా ఇంద్రియములు నిగ్రహించుటకు ప్రయత్నించినచో ఆధ్యాత్మిక జీవితములో విఫలురు అగుదురు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ:

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ..

Advertisement

తాజా వార్తలు

Advertisement