Thursday, May 2, 2024

అసత్యపు ఆరోపణలు వద్దు

పెద్దకొత్తపల్లి : ఐపిఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని స్వేరోస్‌ ఆద్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా స్వేరోస్‌ జిల్లా అద్యక్షుడు దుబ్బ నాగేష్‌ మాట్లాడుతూ తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపిఎస్‌ పై గత రెండు రోజులుగా బిజెపి దాని అనుబంధ సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారం ఆరోపణలను మానుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రాము, మండల అద్యక్షుడు నాగరాజు, పర్వతాలు, రామకృష్ణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement