Saturday, April 20, 2024

గ్రామాభివృద్దికి చేయూత

పెద్దకొత్తపల్లి :గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని గ్రామ సర్పంచు వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామ ప్రజలను కోరారు. గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించుకున్న ముద్దనూరు చిన్నకుర్మయ్యకు గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద చెక్కును పంపిణీ చేశారు. అనంతరం సర్పంచు వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకొని గ్రామాభివృద్దికి తోడ్పడాలని ఆయన కోరారు. రోడ్లపైకి మురుగునీరు రానివ్వకుండా చెత్తను రోడ్లపైన వేయకుండా ఆ కాలనీలో శుభ్రంగా ఉండేందుకు సహాయ సహాకారాలు అందించి గ్రామాభివృద్దిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే చెక్కులు అందజేస్తామని ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్‌నాయక్‌, వార్డు మెంబర్స్‌ గడ్డి కోపుల ఎల్లయ్య, మహేష్‌ ఆచారి, ఆంజనేయులు పాల్గొన్నారు.
———————————————————————————

Advertisement

తాజా వార్తలు

Advertisement