Saturday, October 12, 2024

మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ నేత పోట్లకు బ్రెయిన్ స్ట్రోక్ – అపోలోలో అత్యవసర చికిత్స

ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు హైదరాబాదులో గాంధీ భవన్ కు వెళ్లి వస్తుండగా అసెంబ్లీ టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ తో బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలిసింది. ఒక్కసారిగా కింద పడిపోవడంతో పక్కనే ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు వెంటనే ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. వెంటనే అత్యవసర వైద్యం అందించిన అపోలో డాక్టర్లు ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు.

కొత్తగూడెం అసెంబ్లీ సీటును ఆశిస్తున్న పోట్ల నాగేశ్వరరావు కొద్ది రోజులుగా కొత్త నాయకుల చేరికలతో తనకు సీటు వస్తుందో రాదో అన్న టెన్షన్ తో ఉంటున్నట్లు సమాచారం. విషయం తెలియడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క సారధ్యంలో వైద్యులు అత్యవసర వైద్యం అందించినట్లు సమాచారం. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement