Friday, July 26, 2024

SRH vs PBKS | పంజాబ్‌పై విజయం.. రెండవ స్థానానికి హైదరాబాద్

ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల భారీ ఛేదనలో ఎస్‌ఆర్‌‌హెచ్‌ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకుంది. ఇక ఈ సీజ‌న్ ప్లేఆప్స్‌కు ఇప్పటికే క్వాలిఫై అయిన హైదరాబాద్ జట్టు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

భారీ ఛేదనలో యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(66) అర్ద శ‌త‌కంతో విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయినా… ఒత్తిడికి గురికాకుండా అభిషేక్ అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ (42)తో చెలరేగి తృటిలో హాఫ్​ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక, రాహుల్ త్రిపాఠి 33, నితీష్ కుమార్ రెడ్డి 37 బౌండరీలతో వీరవిహారం చేశారు. ఆకర్లో వచ్చిన అబ్దుల్ సమద్ (11), సన్వీర్ సింగ్ (8)లు నాటౌట్‌గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement