Wednesday, May 22, 2024

పిల్లల దత్తత అనేది చట్టబద్ధంగా ఉండాలి..

హన్మకొండ, (ప్రభన్యూస్): మాతృత్వం ఒక వరం అందుకు చట్ట బద్దమైన దత్తత మరో మార్గమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కే.దామోదర్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం హనుమకొండ కంచరకుంటలోని శిశు గృహంలో ప్రమోషన్ ఆఫ్ లీగల్ అడాప్షన్ పై అవగాహన కార్యక్రమం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా దామోదర్ పాల్గొని మాట్లాడారు.

పిల్లలు లేని దంపతులు పిల్లల కోసం బంధువులు తెలిసిన వారి ద్వారా చట్ట బద్దం కానీ దత్తత తీసుకుంటున్నారని అన్నారు. దత్తత పేరుతో పిల్లలను అమ్మడం కొనడం నేరమని చట్ట బద్ధంగా ఇప్పుడు దత్తత మార్గం సులువని చట్ట బద్ద దత్తత కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కేర్.ఎన్ఐసీ.ఇన్ ద్వారా వివరాలను పొందుపరచినట్లైతే కేంద్ర దత్తత వనరుల విభాగం కోర్టు ద్వారా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఏ ప్రయోజనం కోసమైనా బాలుడు లేదా బాలికను అమ్మటం కొనడం నేరమని అందుకు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని తెలిపారు. నర్సింగ్ హోం ప్రసూతి గృహంలో పనిచేసే వారు ఎవరైనా బాల బాలికల విషయంలో చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు.

బాలల న్యాయ చట్టం 2015 కేంద్ర దత్తత వనరుల విభాగం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పూర్తి వివరాలకు బాల రక్షా భవన్, శిశు గృహ అధికారులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారు దత్తత తీసుకున్న 25 కుటుంబాలకు చెందిన తల్లితండ్రులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ దూడం నగేష్,కౌన్సిలర్ అనుముల మాధవి, సోషల్ వర్కర్ సంగి చైతన్య పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement