Saturday, June 15, 2024

Secundrabad – బాలిక‌పై ర్యాపిడో డ్రైవ‌ర్ లైంగిక దాడి..

సికింద్రాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. బయటకు వెళ్లిన తర్వాత.. ఆమెకు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె వివరాలు తెలుసుకున్న సందీప్.. ఇదే అలుసుగా తీసున్నాడు. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. రోడ్డుపై వెళ్లడం మంచిది కాదని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అతడి దురుద్దేశం తెలియని యువతి ర్యాపిడో డ్రైవర్ సందీప్‌తో కలిసి లాడ్జికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత సందీప్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఏడుస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదుచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement