Saturday, June 15, 2024

Telangana – పసి పిల్లలను విక్రయిస్తున్న ఆర్ ఎం పీ డాక్ట‌ర్ అరెస్ట్

మేడిపల్లి, (ప్రభన్యూస్) : మూడు నెలల పసికందును అమ్ముతున్న ఆర్ ఎం పి డాక్ట‌ర్ ను మేడిప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమ్మ‌కం గుట్టు, ఓ స్వచ్చంద సంస్థ ద్వారా రట్టయ్యింది. వివ‌రాల‌లోకి వెళితే అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్ లో ఆర్ ఎం పీ వైద్యురాలు శోభా రాణి సంప్ర‌దించారు.. పాప‌ను నాలుగున్నర లక్షలకు ఇప్పిస్తానని డాక్ట‌ర్ ఫోన్ ద్వారా చెప్పింది..

దీంతో పాప‌ను కావాల‌నుకుంటున్న మ‌హిళ‌ ముందుగా 10 వేలు అడ్వాన్స్ గా చెల్లించింది.., పాపకోసం వారు క్లినిక్ కు రాగ వేరే మహిళా అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించింది.. దీంతో సంస్థ మహిళలు పోలీసులకు, మీడియా కు స‌మాచారం అందించారు. పోలీసులు చేరుకొని వీరందరిని పోలీస్ స్టేషనకు విచారణ కోసం తరలించారు. పేద కుటుంబం పిల్లలను పోషించడం క‌ష్ట‌మ‌ని పాల‌ తల్లి చెప్పడంతో మానవత్వతో అమ్మాయిని పిల్లలు లేనివారికి అమ్మానని శోభరాణి వివ‌రించింది.. దీంతో ఆమెపై కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement