Sunday, May 26, 2024

Breaking: తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద కారులో మంట‌లు

తెలంగాణ అసెంబ్లీ స‌మీపంలో ఓకారులో మంట‌ల చెల‌రేగాయి. అసెంబ్లీ గేట్ -1 వ‌ద్ద కాసేప‌టి క్రితం వేగంగా వెళ్తున్న కారులో మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ – టీఎస్ 09 ఈవీ 3423. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కారు డ్రైవ‌ర్.. క్ష‌ణాల్లోనే కారు నుంచి దిగి ప్రాణాల‌ను కాపాడుకున్నారు. అక్క‌డే ఉన్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపుచేశారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఫైరింజ‌న్‌తో పాటు అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ విధుల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో కారులో చెల‌రేగిన మంట‌ల‌ను క్ష‌ణాల్లోనే ఆర్పేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement