Tuesday, May 7, 2024

AITUC: కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం

జైనూర్, జూన్ 22 (ప్రభ న్యూస్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. గురువారం కొమురం భీం జిల్లా మండల కేంద్రంలో గురువారం ఏఐటీయూసీ జైనూర్ మండల సమావేసం మార్కెట్ యార్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా భోగే ఉపేందర్ మాట్లాడుతూ… కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా తయారు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ, నేటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మోడీ పరిపాలన మొత్తం కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా ఉందన్నారు.

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి చెల్లించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.32000 చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మెస్రం ఇంద్రు, నాయకులు దినుకర్, దత్తు, మారుతి, లక్ష్మణ్, సీతారాంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement