Friday, May 3, 2024

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ..

కాసిపేట : మండలం పెద్దనపెల్లి నాయకపుగూడెం గ్రామంలోని వాలీబాల్‌ క్రీడాకారులకు స్థానిక సర్పంచ్‌ వేముల కృష్ణ క్రీడా దుస్తులతో పాటు వాలీబాల్‌ ఆట వస్తువులను అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తన తండ్రి వేముల గౌరయ్య, అన్న వేముల సదానందంల జ్ఞాపకార్దం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రిని అందించినట్టు తెలిపారు. యువకులు చెడు వ్యసనాల వైపు మరలకుండా మంచి క్రీడా స్పూర్తితో పలు పోటీల్లో పాల్గొని రాణించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ క్రీడాకారులు భైరగోని సిద్దయ్య, వార్డ్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement