Tuesday, May 14, 2024

ముత్యంపల్లిలో సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు

కాసిపేట : కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టబోయే సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను నాయకులు ప్రారంభించారు. జెడ్‌పీ నిధులు రూ.1.50లక్షలతో బరిగెల ఆశాలు ఇంటి నుండి గొడిసెల ఎల్లమ్మ ఇంటి వరకు రూ.1.50లక్షలతో, కోట రాజం ఇంటి నుండి సూరం రాజమ్మ ఇంటి వరకు నిర్మాణం కోసం జెడ్‌ నిధులను కేటాయించినట్లు వైస్‌ ఎంపీపీ విక్రమ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ఆడె బాదు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మోటూరి వేణు, లంక లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ తిరుపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement