Wednesday, May 8, 2024

తిర‌ప‌తిలో కాక మొద‌లు…

తిరుప‌తి: రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నికలు మండు వేసవి వాతావరణాన్ని తలపిస్తున్నా యి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుం డగా, అధికార వైకాపా ఆశించిన మెజార్టీ సాధించడం సాధ్యమయ్యే పనేనా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. గత ఎన్నికలలోనే 2.28 లక్షల మెజార్టీ సాధించిన తమకు ఇప్పుడు అవలీలగా 4 లక్షల మెజార్టీ వస్తుందని అధికార వైకాపా నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో క్లీన్‌ స్వీప్‌చేసిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అం దించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ పార్టీ విజయకేతనా నికి నాంది పలుకబోతున్నాయని వారు ఘంటాపథం గా చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రంగంలోకి దిగి అధికార వైకాపాను కట్టడి చేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నా యి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి మరీ ప్రచారాన్ని ప్రారంభిం చింది. ఇక ఏపీలో ఇపుడు బీజేపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తదితర ప్రతికూల పరిస్థితు లు నెలకొనగా మిత్రపక్ష జనసేన సహకరిస్తుందా లేదా అన్న సంశయం నెలకొంది. ఈనేపథ్యంలో తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.
2014, 2019లో ఇలా…
2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5,80,376 ఓట్లు- సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్‌ బీజేపీ తరపున పోటీ- చేసి 44.76 శాతంతో మొత్తం 5,42,951 ఓట్లు- సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ తరపున చింతా మోహన్‌ పోటీ- చేసి కేవలం 33,333 ఓట్లు- సాధించగలి గారు. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం (సిపిఎం) 0.92 శాతంతో 11,168 ఓట్లు- సాధించారు. నోటాకు 2.94 శాతంతో 35,420 ఓట్లు- పడ్డాయి. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్‌ రావు పోటీ- చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్‌ రావు 55.03 శాతంతో 7,22,877 ఓట్లు- సాధించారు. ఆయన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మపై 2,28,376 ఓట్ల మెజారిటీ-తో గెలుపొందారు. పనబాక లక్ష్మకి 37.65 శాతంతో 4,94,501 ఓట్లు- పడ్డాయి. నోటాకు 1.96 శాతంతో 25,781 ఓట్లు- రాగా.. కాంగ్రెస్‌ తరపున పోటీ- చేసిన చింతా మోహన్‌కు 1.84 శాతంతో 24,039 ఓట్లు-, బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతంతో 20,971 ఓట్లు-, బీజేపీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 1.22 శాతంతో 16,125 ఓట్లు- పడ్డాయి.
క్యాంపు రాజకీయాలకు శ్రీకారం
ఇదిలావుంటే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి బుధవారం నెల్లూరులో నామినేషన్‌ దాఖలు చేశారు. గత నాలుగు రోజులుగా ఆమె టీ-డీపీ కీలక నేతలతో కలిసి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో మంగళ వారం ప్రత్యేక సమావేశం జరిగింది. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆమె గురువారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు అధికార వైసీపీ బుధవారం తిరుపతిలో కీలక సమా వేశం నిర్వహించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యా రు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కూడా హాజరై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ప్రచార వ్యూహంపై చర్చించారు. ఇంకోవైపు బీజేపీ ముఖ్య నేతలందరు తిరు పతిలోనే మకాం పెట్టారు. స్థానికాం శాలు కాకుండా జాతీయ అంశాలు, నరేంద్ర మోదీ చరిష్మాల ఆధారంగా ఎన్నికల ప్రచా రం నిర్వ హించా లని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారా యణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తిరుపతికి చేరుకుని నేతలతో కలిసి ఎన్నికపై వ్యూహరచన చేశారు. నియోజక వర్గ నేతలతో భేటీ- కావడంతో పాటు- జనసేనతో సమన్వ యం గురించి చర్చించారు.
కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్‌ ప్రచారం కూడ ప్రారంభించారు. అధికార వైసీపీ లక్ష్యంగా ఆయన విమర్శలు మొదలు పెట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రి-టైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి కె.రత్నప్రభ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కాగా, ఆమె 1981 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. కన్నడ ప్రభుత్వంలో ఆమె పలు హోదాలలో పని చేశారు. 2018 జూన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 2019లోనే ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త ఎ.విద్యాసాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రి-టైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. రత్నప్రభ కూడా కొన్నాళ్లు
డిప్యుటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement