Wednesday, May 8, 2024

Breaking: భవిష్యత్ లో నా తమ్ముడికి మద్దతిస్తానేమో?.. మెగాస్టార్ చిరంజీవి

పవన్ లాంటి నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు మనకు రావాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఇవ్వాల జరిగిన గాడ్​ ఫాదర్​ ప్రి రిలీజ్​ ఈవెంట్​లో చిరంజీవి మాట్లాడుతూ పలు విషయాలు షేర్​ చేసుకున్నారు. తమ్ముడి పాలిటిక్స్ పై అన్నయ్య ఇంట్రెస్టింగ్ కామెంల్స్​ చేశారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉన్నానని, పవన్​ రైజ్​ కావడానికి తాను అలా చేశానన్నారు.

అంతేకాని ప్రస్తుత లీడర్లపై తాను ఎలాంటి సెటైర్లు వేయలేదన్నారు. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని, ఎటువైపు ఉండాలన్నది కూడా ప్రజల చేతుల్లోనే ఉంటుందన్నారు. తాను రాజకీయాల నుంచి బయటకు రావడం.. పవన్ కు ఉపయోగపడుతుందన్నారు. పవన్ కు ప్రజలు అధికారం ఇచ్చే రోజు వస్తుందేమో వేచి చూడాల్సిందేనన్నారు. అంత మంచి నిబద్ధతగల నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని చిరంజీవి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement